MLA Rajagopal Reddy: నిరుద్యోగ యువతకు అండగా నేనుంటా.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
MLA Rajgopal Reddy: హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులు అర్పించారు.
MLA Rajgopal Reddy: హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులు అర్పించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం.. ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రూప్ 1 అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. అమరవీరుల సాక్షిగా నిరుద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు. వారి సమస్యలు వినేందుకు తానే వస్తానని వివరించారు. నిరుద్యోగుల నిరసనలకు తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. నిరుద్యోగుల పట్ల ఏ సమస్య ఎదురైనా దానిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని స్పష్టం చేశారు.