Kishan Reddy Visits Covid Hospitals: కోవిడ్ ఆసుపత్రుల్లో కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy Visits Covid Hospitals: ఈరోజు బీజీపీ నేత కిషన్ రెడ్డి హైదరాబాద్ లో కోవిడ్ ఆసుపత్రులలో పర్యటించారు.

Update: 2020-08-01 06:35 GMT
Kishan Reddy Visits Covid Hospitals in Hyderabad

Kishan Reddy Visits Covid Hospitals: ఈరోజు బీజీపీ నేత కిషన్ రెడ్డి హైదరాబాద్ లో కోవిడ్ ఆసుపత్రులలో పర్యటించారు. అనంతరం ఆయన గాంధీ ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమ్మన్నారో ఆయన మాటల్లోనే...

♦ రెండవ దశలో మరిన్ని హాస్పిటల్ లు సందర్శించాను గచ్చిబౌలి టీమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నా.

♦ కోవిడ్ బెడ్స్ మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది..

♦ ఇవాళ తెలంగాణ లో అత్యధికం గా కేసులు నమోదయ్యాయి.

♦ ఆగస్టు లో భారీగా కేసులు వచ్చే అవకాశం ఉంది మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.

♦ గ్రామాల సర్పంచ్ ల నుండి ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన అవసర ఉంది.

♦ కోవిడ్ వారియర్స్, సిబ్బంది జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది.

♦ వెంటిలేటర్ లు పెంచాలి.

♦ ఔట్ సోర్సింగ్ డాక్టర్స్ ,సిబ్బంది ని మరింత పెంచాలి.

♦ ఈరోజు కరోన భారిన పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని అప్పులపాలై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

♦ అందుకోసం ప్రభుత్వ హాస్పిటల్ లలో సరైన వసతులు ఉన్నాయని ప్రభుత్వానికి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

♦ ఢిల్లీ, పూణే, ముంబై లాంటి నగరాలతో పోల్చితే టెస్టుల సంఖ్యలు మరిన్ని పెంచాలి.

♦ పాజిటివ్ వచ్చిన వారు తప్పుడు అడ్రెస్ ఇవ్వడం, బయట తిరగడం లాంటివి చేస్తున్నారు ఇది అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత.

♦ 10 లక్షల N95 మస్కులు 2లక్షల 30 వేల ppe కిట్స్ తెలంగాణ కి కేంద్ర ప్రభుత్వం అందించింది.

♦ ఇక్కడ బెడ్ల సంఖ్యలు పెంచాల్సిన అవసర ఉంది.

♦ ఢిల్లీ లో రికవరీ రేటు 85 శాతం ఉంది తెలంగాణ లో రికవరీ రేటు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

♦ తెలంగాణ ప్రభుత్వం తో సమన్వయం గా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది.

♦ కేసులు, టెస్టులు మరణాల విషయం లో దాపరికాలు అవసర లేదు.

♦ మరణాల సంఖ్యను తగ్గించే విషయంలో ప్రభుత్వం అలాంటి తప్పులు చేయద్దు అని విజ్ఞప్తి.

♦ రాష్ట్ర ప్రభుత్వ లోపాలు ఏమైనా ఉంటే సరిద్దిద్దుకోవాలి.

♦ ఆస్తమా, డయాలసిస్ గుండె సంబంధ రోగులు దయచేసి ఇంట్లో నుండి ఎవరూ బయటకు రాకూడదు.

♦ కరోన మహమ్మారి కి ఇంతవరకు వాక్సిన్ రాలేదు.

♦ పాజిటివ్ వచ్చిన వారు బయటకు తిరగడం సరికాదు.

♦ పాజిటివ్ నుండి కోలుకుని వచ్చిన వారు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలి. 

Tags:    

Similar News