Kishan Reddy: మజ్లీస్ పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించారు

Kishan Reddy: బీజేపీ ఆధ్యర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Update: 2025-09-17 10:20 GMT

Kishan Reddy: బీజేపీ ఆధ్యర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజాం నియాంత పాలన నుంచి సర్దార్ వల్లభాయి పటేల్ విముక్తి కలింగించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో హైదరాబాద్ ముక్తి దివాస్ జరుపుతుంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మజ్లీస్ పార్టీకి భయపడి తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం గురించి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పాలకులు తెలంగాణ‎ చర్రితను వక్రీకరిస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర లేకుండా.. విద్యార్థులకు తెలవకుండా చరిత్రను దాచిపెడుతున్నారని ఆరోపించారు. వచ్చే మూడు సంవత్పరాల తర్వత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వత తెలంగాణ విముక్తి దినోత్నవం జరుపుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News