Kishan Reddy: అరెస్టు సమయంలో గాయపడిన కిషన్ రెడ్డి

Kishan Reddy: బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డి

Update: 2023-09-14 01:51 GMT

Kishan Reddy: అరెస్టు సమయంలో గాయపడిన కిషన్ రెడ్డి

Kishan Reddy: నిరుద్యోగ యువతను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద కిషన్‌రెడ్డి తలపెట్టిన 24 గంటల ఉపవాస దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను దీక్షా స్థలినుంచి నేరుగా బీజేపీ కార్యాలయం తరలించారు. దీక్షను భగ్నం చేసే క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు పెనుగులాటలో కిషన్ రెడ్డి నలిగిపోయారు. చేతులు, ఛాతీపై, ఒంటిపై అక్కడక్కడ గోళ్లు గీరుకుపోయాయి. దీంతో దీక్షతో నీరసపడటం, పోలీసుల అరెస్టు చేసే సమయంలో గాయపడటంతో అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ గతంలో ప్రకటించిన విధంగానే 24 గంటల ఉపవాస దీక్ష కొనసాగిస్తామని కిషన్ రెడ్డి పూనుకున్నారు. కార్యాలయం చేరుకున్న తర్వాత నీరసంగా ఉండటంతో డాక్టర్లు బీపీ, షుగర్ లెవల్స్ పరీక్షించారు.

Tags:    

Similar News