Keesara Tahsildar Case: ఏసీబీ కస్టడీకి నలుగురు నిందితులు
Keesara Tahsildar Case: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో నేడు మరోసారి నలుగురు నిందితులను కస్టడీ లోకి తీసుకోనున్న ఏసీబీ.
Keesara Tahsildar Case
Keesara Tahsildar Case: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో నేడు మరోసారి నలుగురు నిందితులను కస్టడీ లోకి తీసుకోనున్న ఏసీబీ. రెండు రోజుల విచారణ లో కోటి 10 లక్షల రూపాయల పై వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు. ఈ కేసులో ఉన్న తహసీల్దారు నాగరాజు, వీఆర్వో సాయిరాజ్, వీరితో పాటు నిందితులుగా ఉన్న శ్రీనాథ్, అంజిరెడ్డిలను రెండో రోజు విచారించిన ఏసీబీ అధికారులు, పలు కీలకమైన సమాచారాన్ని రాబట్టి నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అంజిరెడ్డి ఇంటిలో లభించిన భూముల తాలూకు డాక్యుమెంట్లపైనా అధికారులు విచారించినట్టు సమాచారం.
లంచంగా ఇచ్చిన రూ.1.10 కోట్ల నెట్ క్యాష్ ఎవరిదన్న ప్రశ్నకు ఫిర్యాదిదారుల నుంచి కూడా సమాధానం రాకపోవడంతో అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. నేడు నలుగురు నిందితులను చంచల్ గూడ జైల్ నుండి కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ తహశీల్దార్ నాగరాజు నగదు లావాదేవీలు, బ్యాంక్ లాకర్ల పై ఆరా తీయనున్నరు. ఆంజిరెడ్డి, శ్రీనాథ్ లకు ఇంట్లో దొరికిన ప్రజా ప్రతినిధులకు సంబంధించిన డాక్యుమెంట్లపై వివరాలు సేకరించనున్నరు ఏసీబీ అధికారులు. నేటితో నిందితుల కస్టడీ ముగియనున్నడటంతో మరికొంత మంది సాక్షులను పిలిచి విచారించనున్నరు ఏసీబీ అధికారులు.