ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
Statue of Equality: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు.
ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
Statue of Equality: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. సమతా మూర్తి కేంద్రాన్ని కేసీఆర్ పరిశీలించారు. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించారు. 12 రోజులపాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగనున్నాయి.