KCR: జూబ్లీహిల్స్ బై పోల్‌పై బీఆర్‌ఎస్ అధినేత KCR ఫోకస్.. ఇవాళ ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం

KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో BRS పార్టీ ప్రచారంపై ఫోకస్ పెట్టింది.

Update: 2025-10-23 05:37 GMT

KCR: జూబ్లీహిల్స్ బై పోల్‌పై బీఆర్‌ఎస్ అధినేత KCR ఫోకస్.. ఇవాళ ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం

KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో BRS పార్టీ ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు, పార్టీ డివిజన్ ఇంఛార్జ్‌లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. ఈ భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతుల‎పై చర్చించినట్టు సమాచారం. BRS పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్లు సమాచారం.

Tags:    

Similar News