Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుంది

Kishan Reddy: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీజేపీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం

Update: 2023-02-05 05:22 GMT

Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుంది 

Kishan Reddy: KCR ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని లీ ప్యాలెస్‌లో జరిగిన బిజెపి జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. దళితులను సీఎం చేస్తానని చెప్పి చెయ్యలేదని, దళితులకు మూడు ఎకరాల స్థలం ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. దళితబంధు స్కీంను దళితులందరికి అమలు చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగo పాతదైందని మరో కొత్త రాజ్యాంగం రావలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. దళితబంధు విషయంలో ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని మేలుకొల్పేందుకు పోరాటం చేయాలన్నారు.

Tags:    

Similar News