MLC Kavitha: మోడీ సర్కారుకు ఎనిమిది ప్రశ్నలు..
MLC Kavitha: బీజేపీ 8ఏళ్ల పాలనలో ప్రజలు నిస్సాహాయులుగా మిగిలిపోయారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
MLC Kavitha: మోడీ సర్కారుకు ఎనిమిది ప్రశ్నలు..
MLC Kavitha: బీజేపీ 8ఏళ్ల పాలనలో ప్రజలు నిస్సాహాయులుగా మిగిలిపోయారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగలేదన్నారు. 8 ఏళ్ల పాలనలో బీజేపీ వైఫల్యాలపై ఆమె మోడీ సర్కారుకు ట్విటర్ వేదికగా 8 ప్రశ్నలు సంధించారు. తాను వేసిన ఈ ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని సవాల్ విసిరారు. మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా మహిళా సాధికారత సాధించడంపై మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ మోడీజీ అంటూ ప్రశ్నించారు. దేశ జీడీపీ పడిపోతున్నా గ్యాస్, డీజిల్, పెట్రోల ధరలు పెరుగుతున్నాయి విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవని ప్రశ్నించారు. అమితంగా పెంచిన ఇంధన ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారని ప్రశ్నించారు కవిత.