దివ్యాంగుడికి స్నానం చేయించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Update: 2019-06-29 14:51 GMT

కరీంనగర్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. రోడ్డుపైనున్న నల్లా వద్ద స్నానం చేసేందుకు ఓ దివ్యాంగుడు ఇబ్బందులు పడుతున్నాడు. అటు నుంచి వెళుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్యనారాయణ దివ్వాంగుడి ఇబ్బంది గమనించాడు. దివ్యాంగుడి వద్దకు వెళ్లి అతడి తల, ఒంటికి తన చేతులతో సబ్బుతో రుద్ది స్నానం చేయించాడు. అలా చేస్తుండటం తో అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీస్తూ మీరు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించారు.

Full View 

Tags:    

Similar News