Karimnagar Corona Cases: ప్రాణాలమీదకు తెచ్చిన మాస్కు గొడవ !

Update: 2020-07-29 10:38 GMT
ప్రతీకాత్మక చిత్రం

Karimnagar Corona Cases: కరోనా వైరస్ కి ఇంకా సరైన వ్యాక్సిన్ రాకపోవడంతో దాన్ని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్లినపుడు శానిటైజర్లు రాసుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించాలని చెపుతూనే ఉన్నాయి. కానీ చాలా మంది ప్రజలు ప్రభుత్వం చెప్పే మాటలను పెడచెవిన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు. దీంతో కరానా కేసుల సంఖ్య భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. అంతే కాదు ఎదుటి వారు జాగ్రత్తలు చెప్పినా కూడా పాటించకుండా ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. మరికొంత మంది అయితే నువ్వేంటి నాకు చెప్పేది అంటూ వారిపై దాడికి దిగుతున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌లో ఓ యువకుడికి మరో వ్యక్తికి మాస్కు ధరించమని చెప్పినందుకు ఓ యువకుడు ఆ వ్యక్తిపై దాడి చేసాడు. ఆ మంచి మాటే ఇప్పుడు అతని ప్రాణాల మీదకు వచ్చింది. ఈ సంఘటన కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే కరీంనగర్ చెందిన అజీజ్‌ అనే వ్యక్తి హెయిర్‌ కటింగ్ కోసం సెలూన్ షాప్ వద్దకు వచ్చాడు. అతను మాస్కు ధరించకపోవడంతో అదే గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకొమ్మని అజీజ్ ను కోరాడు. దీంతో కోపోధ్రుక్తుడైన అజీజ్ రాకేష్ తో గొడవకు దిగాడు. చిన్నగా మొదలైన గొడవ మాట మాట పెరిగింది. అంతటితో ఆగకుండా అజీజ్ కత్తితో రాకేష్ పై దాడికి తెగబడ్డాడు. కత్తితో నేరుగా పక్కటెముకల వద్ద, వీపులో రెండు కత్తిపోట్లు దించాడు. దీంతో రాకేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు గాయపడ్డ రాకేష్‌ను హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మరికొంత మంది నిందితున్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అజీజ్‌ గంజాయి మత్తులో ఉండి దాడి చేసినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.




Tags:    

Similar News