Pawan Kalyan Mask Goes Viral: పవన్ కళ్యాణ్ మాస్క్ పైన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ!

Pawan Kalyan Mask Goes Viral: పవన్ కళ్యాణ్ మాస్క్ పైన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ!
x
Pawan Kalyan (File Photo)
Highlights

Pawan Kalyan Mask Goes Viral: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ తర్వాత పెద్దగా కనిపించలేదు.. కరోనా పైన అవగాహన కానీ తాజా రాజకీయ పరిస్థుతుల పైన

Pawan Kalyan Mask Goes Viral: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ తర్వాత పెద్దగా కనిపించలేదు.. కరోనా పైన అవగాహన కానీ తాజా రాజకీయ పరిస్థుతుల పైన కానీ అయన సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తూ వచ్చారు. అయితే తాజాగా అయన జనసేన సైనికుల మేరకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సామజీక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పవన్..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే... ఈ దీక్షకి సంబంధించిన పలు విషయాలను పవన్ పంచుకున్నారు..అంతేకాకుండా జాతీయ, ప్రాంతీయ రాజకీయాల పైన పవన్ స్పందించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ పెట్టుకున్న ధరించిన మాస్క్ పైన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ మాస్క్‌ మీద 'Specially Designed For PK'అని రాసి ఉంది. ఈ మాస్క్ ని పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారట.. ఈ మాస్క్ ముక్కు, నోరును పూర్తిగా కవర్ చేసేలా ఉంది. ప్రస్తుతం పవన్ ధరించిన మాస్క్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇది ఇలా ఉంటే రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది .ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.


Show Full Article
Print Article
Next Story
More Stories