Kaleshwaram Project Case: తెలంగాణ హైకోర్టుకు మరోసారి కేసీఆర్, హరీష్‌రావు
Kaleshwaram Project Case: తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్‌రావు.
Kaleshwaram Project Case: తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎలాంటి విచారణ చేపట్టవద్దని.. వారు మళ్లీ మెన్షన్ చేయనున్నారు. ఇప్పటికే కాళేశ్వరంపై ఘోష్ కమిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని టీజీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు రిటైర్డ్ సీఎస్ ఎస్కే జోషి. ప్రభుత్వం సాక్షిగా మాత్రమే తనకు నోటీసులు ఇచ్చిందని, లీగల్ నోటీసులు ఇవ్వలేదని రిటైర్డ్ సీఎస్ జోషి కోర్టుకు తెలిపారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.