KTR: ఎవరెన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం తెలంగాణకు జీవధార.. సజీవ జలధార
KTR: ఎవరెన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం తెలంగాణకు జీవధార.. సజీవ జలధార
KTR:ఎవరెన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం తెలంగాణకు జీవధార.. సజీవ జలధార
Kaleshwaram is the lifeblood of Telangana no matter who does the conspiracies Says KTR
KTR: కాంగ్రెస్ నేతలను విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్ట్.. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతల కుల్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎన్ని కుట్రలు చేసినా.. ఎప్పటికీ కాళేశ్వరం తెలంగాణకు జీవధార.. సజీవ జలధార అంటూ ట్వీట్ చేశారాయన. ఇక కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా.. చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు.