Kadiyam Srihari: బీఆర్ఎస్, బీజేపీపై కడియం తీవ్ర విమర్శలు
Kadiyam Srihari: తెలంగాణ విభజన చట్టంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
Kadiyam Srihari: బీఆర్ఎస్, బీజేపీపై కడియం తీవ్ర విమర్శలు
Kadiyam Srihari: బీఆర్ఎస్, బీజేపీపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విభజన చ్టంలోని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అహంకార పూరిత మాటలు మానుకోవాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవాలని సూచించారు. మందకృష్ణ, మోత్కుపల్లి, తాటికొండ రాజయ్యల గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోనన్నారు. రేపు వరంగల్ లో జనజాతర బహిరంగ సభకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కడియం శ్రీహరి కోరారు.