Kadem Project: నిండుకుండలా కడెం ప్రాజెక్ట్.. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద
Kadem Project: నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతోంది.
Kadem Project: నిండుకుండలా కడెం ప్రాజెక్ట్.. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద
Kadem Project: నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ఐదు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అదికారులు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 697.3 అడుగుల వరకు నీరుంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.69 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు ఉంది.
51 వేల 173 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. 56 వేల 90 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో.. దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.