Kadem Project: కడెం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

Kadem Project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది.

Update: 2025-09-26 08:47 GMT

Kadem Project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 698 అడుగులకి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 4 వేల 699 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4 వేల 282 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 6 వేల 553 క్యూసెక్కులుగా... ఔట్ ఫ్లో 19 వేల 947 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.

Similar News