Junior Doctors: హైదరాబాద్ జూడాల ఆందోళన విరమణ

జూడాలు చేస్తున్న ఆందోళనపై మంత్రి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో విరమించారు.

Update: 2020-06-11 02:40 GMT
Health Minister Etela Rajender Meeting with Junior Doctors

జూడాలు చేస్తున్న ఆందోళనపై మంత్రి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో విరమించారు. ఇటీవల కాలంలో తరచుగా జూనియర్ వైద్యులతో దాడులు పెరుగుతున్నాయి. మంగళవారం ఇదే తరహాలో ఒక జూనియర్ వైద్యునిపై దాడి చేయడంతో అందరూ విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ వారితో సమావేశమై దాడి చేసిన వారిని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

ఎట్టకేలకు గాంధీ అస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించారు. నిన్న రాత్రి పేషేంట్ తరుపు బంధువుల దాడితో నిరసన తెలుపుతున్న వైద్యులు.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు ఫలించడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. జూడాల డిమాండ్లపై మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. వైద్యుల పై దాడి జరిగితే ఎవరిని ఉపేక్షించబోమని భరోసా ఇవ్వడంతో తిరిగి జూడాలు విధుల్లో చేరుతున్నారు. ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే డాక్టర్లతో మంత్రి ఈటల మరోదఫా చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర పరిస్థితులు, సమస్యలపై అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి. 

Tags:    

Similar News