సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జూన్ టెన్షన్

June Tension: జూన్ మాసం వచ్చిదంటే చాలు రైతన్నల గుండెలు గుబులు మంటాయి.

Update: 2022-06-11 01:30 GMT

సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జూన్ టెన్షన్

June Tension: జూన్ మాసం వచ్చిదంటే చాలు రైతన్నల గుండెలు గుబులు మంటాయి. సాగుకు పెట్టుబడి డబ్బులు పిల్లలకు బడి ఫీజు, పుస్తకాల ఖర్చులు ఒకేసారి మీద పడిపోతాయి. సాగుకు ఖర్చు చేస్తే పిల్లలకు ఫీజులు కట్టలేరు. పిల్లలకు ఫీజులు చెల్లిస్తే సాగుకు పెట్టుబడి పెట్టలేరు. ఇలా జూన్ మాసం వచ్చిదంటే మధ్యతరగతి కుటుంబాలు బెంబేలెత్తిపోతారు.

ఈ నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ఒకేసారి ప్రారంభమవుతాయి. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు చుక్కలను అంటుతున్నాయి. బుక్స్, యూనిఫామ్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వానకాలం సీజన్ మొదలవ్వడంతో రైతులు పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. విత్తనాలు ఇతర ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కొందరు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

జూన్ మాసంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ నెలలో రైతులకు పెట్టుబడి సహాయం కావాలి, సామాన్య ప్రజలకు స్కూల్ ఫీజులు కావాలి. ఇలా అనేకమంది అనేక రకాలుగా డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. కనుక ప్రభుత్వం వెంటనే రైతులకు రైతుబంధు విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు స్కూల్ ఫీజులు తగ్గించినప్పుడే ప్రజలకు కాస్త ఆర్థిక వెసులు బాటు దొరుకుతుంది.

వానాకాలం సీజన్ నెత్తిమీదికి వచ్చింది ఇప్పటి వరకు రైతులకు రైతుబంధు రాలేదు. వ్యవసాయం కోసం లక్షల రూపాయలు పెట్టుబడులు కావాలి. తమ దగ్గర చిల్లిగవ్వ లేదు. మరీ ఇప్పుడు వ్యవసాయం చేయడం ఎలా అంటున్నారు రైతులు. అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లి అవి తీర్చేలేక అవస్థలు పడుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం.

జూన్ మాసంలో స్కూల్‌లో పిల్లలను చేర్పించడానికి లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. గతేడాది కంటే కూడా ఈ సంవత్సరం స్కూల్ ఫీజులు 20% శాతం పెంచారు. గత సంవత్సరంలో రెండవ తరగతి విద్యార్థికి 12 వేల రూపాయలు ఫీజు ఉంటే, ప్రస్తుతం అదే విద్యార్థికి 20 వేల రూపాయలు వరకు పెంచారు. కరోనా సమయంలో పెండింగ్ ఉన్న స్కూల్ ఫీజులను ప్రైవేట్‌ యాజమాన్యాలు తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేశాయి.

సామాన్య ప్రజల పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరముంది. వెంటనే రైతుబంధు డబ్బులు మంజూరు చేయాలంటున్నారు. అలాగే పాఠశాలల్లో ఫీజులను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోవాలని పేద, మధ్యతరగతి కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Tags:    

Similar News