Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేయడంపై నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులకు ప్రజల మద్దతు లభించిందని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ విజయం కోసం పార్టీ తరఫున కష్టపడిన ప్రతి కార్యకర్తకు అంకితం ఇస్తున్నామని ఆయన తెలిపారు. కార్యకర్తల పట్టుదలే ఈ భారీ మెజారిటీకి కారణమని కొనియాడారు.
జూబ్లీహిల్స్ ప్రజల ఈ స్పష్టమైన తీర్పుతో BRS పార్టీకి సెలవు ప్రకటించారని మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.