హెలికాప్టర్ ప్రమాదంలో జవాన్ పబ్బాల అనిల్ మృతి
Helicopter Accident: శోకసంద్రంలో మునిగిపోయిన పబ్బాల అనిల్ కుటుంబసభ్యులు
హెలికాప్టర్ ప్రమాదంలో జవాన్ పబ్బాల అనిల్ మృతి
Helicopter Accident: జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ మృతి చెందారు. కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ఆ ముగ్గురిలో అనిల్ మృతి చెందగా ఇద్దరికి గాయాలైనట్టు తెలిసింది. మలాపూర్ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్య చిన్న కొడుకు అనిల్ 2011లో సైన్యంలో చేరి టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నారు. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్, అరవ్ ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ మృతి చెందిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.