Station Ghanpur: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు

Station Ghanpur: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2023-06-21 06:20 GMT

Station Ghanpur: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు

Station Ghanpur: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని బాండ్ రాసివ్వాలని వేధిస్తున్నాడన్నారు. 20లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. ఓ మహిళా ప్రజాప్రతినిధి తన భర్తను ట్రాప్ చేసి డబ్బులు ఆశ చూపిందని చెప్పారు. బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టాలని తన భర్త ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గతంలో తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకున్నాననేది అవాస్తమని సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే రాజయ్యకు సంబంధించిన ఆడియో రికార్డులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని, డబ్బు అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఆడియో రికార్డులను మీడియాకు విడుదల చేస్తానని చెప్పారు. దీనిపై ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News