Hyderabad: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ దగ్గర టెన్షన్ టెన్షన్
Hyderabad: ప్రెస్‌క్లబ్ దగ్గర జనసేన కార్యకర్తల ఆందోళన
జనసేన కార్యకర్తల నిరసన (ఫైల్ ఇమేజ్)
Hyderabad: హైదరాబాద్ సోమాజిగూడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనసేనాని పవన్‌పై పోసాని చేసిన వ్యాఖ్యల రగడ మరింత రాజుకుంది. పోసాని ప్రెస్ మీట్ జరుగుతుండగానే ప్రెస్ క్లబ్ దగ్గరకు భారీగా చేరుకున్న జనసేనా కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోసాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ ఆందోళనలు చేశారు. దీంతో భారీ భద్రత మధ్య పోసానిని ఆయన ఇంటికి తరలించారు పోలీసులు. అయినప్పటికీ జనసేన కార్యకర్తల ఆగ్రహం చల్లారలేదు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకుంది.