జైపాల్‌రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం

Update: 2019-07-29 06:13 GMT

రాజకీయ దురంధరుడు...అజాత శత్రువు... కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల రోదనలు, ఆత్మీయులు, అభిమానుల శోక సంద్రం నడమ అంతిమ యాత్ర ప్రారంభమైంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల నడుమ జైపాల్ రెడ్డి పార్ధీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి గాంధీ భవన్‌కు తరలిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం గంటపాటు అక్కడే ఉంచుతారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటలోపు జైపాల్‌ రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు సూచించింది. పీవీ ఘాట్‌ పక్కన అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలాగే జైపాల్ రెడ్డికి స్మారక చిహ్నం కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.

జైపాల్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన గ్రామస్థులు, పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం తెలంగాణ శాసననసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ ఇతర ప్రముఖులు నివాళులు అర్పించారు. జైపాల్‌రెడ్డితో తమకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం రాజకీయ నిబధ్దతతో నడుచుకున్నారంటూ స్పీకర్ పోచారం కొనియాడారు. పదవుల కంటే ప్రజా సేవే లక్ష్యంగా జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్తానం సాగిందని ఆయన అన్నారు.  

Tags:    

Similar News