Jagga Reddy: ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు..
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Jagga Reddy: ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు..
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళ్తామని జగ్గారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడాలని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ చెప్పారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారని, పార్టీలో అంతా ఐకమత్యంగా ఉండాలని రాహుల్ చెప్పారని పేర్కొన్నారు. ఇకపై బహిరంగ విమర్శలు ఉండవని, పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవన్నారు. కేవలం కుటుంబంతో కలిసి రాహుల్‌తో భేటీ అయినట్లు జగ్గారెడ్డి వివరించారు.