Jagga Reddy: వీఆర్‌ఏల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

Jagga Reddy: వీఆర్ఏలు కోరినట్లు పే స్కేల్‌ పెంచాలి

Update: 2023-03-06 06:59 GMT

Jagga Reddy: వీఆర్‌ఏల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

Jagga Reddy: వీఆర్‌ఏల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి లేఖ రాశారు. వీఆర్ఏల డిమాండ్స్‌ నెరవేర్చాలని కోరారు. వీఆర్ఏలు కోరినట్లు పే స్కేల్‌ పెంచాలన్న జగ్గారెడ్డి.. వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించేలా జీవో ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. సమ్మె చేసిన 80 రోజుల జీతం కూడా చెల్లించాలని కోరారు జగ్గారెడ్డి.

ప్రస్తుతం వీఆర్ఏలకు ఇస్తున్న జీతం సరిపోదని.. టెన్త్ పాస్ అయిన వారికి 22 వేలు, ఇంటర్ పాస్ అయిన వారికి 26 వేల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. వీఆర్ఏలతో చర్చల సమయంలో మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినా ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. మరోసారి వీఆర్ఏల సమస్యలను దృష్టికి తీసుకొచ్చేందుకే లేఖ రాస్తున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి. 

Tags:    

Similar News