Jagga Reddy: కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని చూస్తున్న బీజేపీ, టీఆర్ఎస్
Jagga Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలమయిన శక్తి
Jagga Reddy: కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని చూస్తున్న బీజేపీ, టీఆర్ఎస్
Jagga Reddy: తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉందని, కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలను కూడా పట్టించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.. తమ పార్టీలో కూడా ఇబ్బందులు ఉన్నాయన్నారాయన... కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తనకు యఫోన్ చేశారని, ప్రజాసమస్యలపై పట్టించుకోకపోతే ఎలా అని అడిగానని చెప్పారు.. మహేష్ గౌడ్ సరిగా పనిచేయడం లేదని విమర్శించారు జగ్గారెడ్డి.. ఆయన పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇంతవరకూ ఏర్పాటు చేయలేదన్నారు. పార్టీకి నష్టం జరిగితే మహేష్ గౌడ్‌దే బాధ్యత అన్నారు..
కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని... ఇందుకోసం ఢిల్లీలో ఉన్న పార్టీ అధిష్టానం ఆలోచించాలన్నారు. గాంధీ కుటుంబం అంటే తనకు చాలా ఇష్టమన్నారు జగ్గారెడ్డి.. బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన పార్టీని వీడిపోవడం నిజమే అయితే పార్టీకి తీవ్ర నష్టమేనన్నారు.