Jagadish Reddy: దేశంలో మా హయాంలో మాత్రమే అప్పులు చేసినట్లు.. అధికార పక్షం మాట్లాడుతోంది
Jagadish Reddy: అప్పులు చూస్తున్నారు తప్ప ఆస్తులు చూడట్లేదు
Jagadish Reddy: దేశంలో మా హయాంలో మాత్రమే అప్పులు చేసినట్లు.. అధికార పక్షం మాట్లాడుతోంది
Jagadish Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. 2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 44 వేల 434 కోట్లు.. అప్పులు 22వేల 423 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగ ఆస్తుల విలువ లక్ష 37 వేల 570 కోట్లు అయితే.. అప్పుల విలువ 81 వేల 516 కోట్లుగా ఉందన్నారు. విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచామన్నారు. ఆనాడు కరెంట్ లేక రైతాంగం దిగాలు పడిందన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.