Koppula Eshwar: దళిత బంధుపై దుష్ప్రచారం తగదు.. బీజేపీ కుట్రతోనే ఉచితాలు రద్దు..
Koppula Eshwar: బీజీపీకి చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో దళితబందు పెట్టాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
Koppula Eshwar: దళితబందుపై దుష్ప్రచారం తగదు.. బీజేపీ కుట్రతోనే ఉచితాలు రద్దు..
Koppula Eshwar: బీజీపీకి చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో దళిత బంధు పెట్టాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దళితబందు పథకంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. బీజేపీ కుట్రతోనే ఉచితాలు రద్దు చేయాలనే అంశాల్లో దళిత బంధు ఉందన్నారు.
దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేయాలని సవాల్ విసిరారు. గుజరాత్, యూపీలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితవర్గాలపై బీజేపీకి ప్రేమ లేదన్నారు. బీజేపీ నేతల మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆయన విమర్శించారు. కుట్రపూరిత రాజకీయాల చేయడం బీజీపీకి అలవాటయ్యిందన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో దళిత బంధుపై సమీక్షలు జరుపుతామన్నారు.