Ministers KTR: బావా.. ఓ రిక్వెస్ట్ అంటూ హరీశ్‌కు కేటీఆర్ ఫోన్
*మంత్రులు కేటీఆర్, హరీశ్ మధ్య ఆసక్తికర ఫోన్ సంభాషణ
Ministers KTR: బావా.. ఓ రిక్వెస్ట్ అంటూ హరీశ్‌కు కేటీఆర్ ఫోన్
Ministers KTR: మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్‌లో ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనకు ఉద్యోగం కావాలంటూ మంత్రి కేటీఆర్ ముందు గోడు వెల్లబోసుకున్నారు. గతంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని ఇప్పుడు ఖాళీగా ఉంటున్నానని కేటీఆర్‌కు మొర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేశారు. బావా చిన్న రిక్వెస్ట్ అంటూ కేటీఆర్ హరీష్ రావుకు చేసిన రిక్వెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.