తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ బస్సుల తనిఖీలు
Telangana: స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తమైన RTA
తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ బస్సుల తనిఖీలు
Telangana: తెలంగాణ వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో RTA అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేస్తున్నారు. ఫిట్‌నెస్ ఉన్న బస్సులు మాత్రమే RTA అధికారులు స్కూళ్ల యాజమాన్యాలకు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫిట్‌నెస్ లేని 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు.