Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విషాదం.. పారిశ్రామిక వేత్త సుధాకర్ మృతి

Hyderabad: గేటు మీద పడటంతో తీవ్ర గాయాలపాలైన సుధాకర్

Update: 2023-03-08 03:07 GMT

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విషాదం.. పారిశ్రామిక వేత్త సుధాకర్ మృతి

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో చోటు చేసుకున్న ప్రమాదంలో పారిశ్రామికవేత్త మృతి చెందారు. సీసీసీ ముందు ప్రాంతాన్ని రక్షణవలయంగా తీర్చిదిద్దేందుకు ఇనుప గేట్ల పనులను చర్లపల్లికి చెందిన శ్రీసాయి ఇండస్ట్రీస్‌ ఎండీ సుధాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గేటు ఏర్పాటు చేసే క్రమంలో అకస్మాత్తుగా ఆయన మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం గాగిల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన సుధాకర్ మౌలాలీ హౌసింగ్‌ బోర్డులో నివసిస్తున్నారు.

Tags:    

Similar News