శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన – ఇండిగో 92 ఫ్లైట్లు రద్దు
ఇండిగో విమానాల రాకపోకలను అనూహ్యంగా నిలిపివేయడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన – ఇండిగో 92 ఫ్లైట్లు రద్దు
హైదరాబాద్: ఇండిగో విమానాల రాకపోకలను అనూహ్యంగా నిలిపివేయడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 92 సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి బయలుదేరాల్సినవి 49 ఫ్లైట్లు ఉన్నాయి.
ముందుగా బుక్ చేసుకున్న టికెట్లు, చెక్‌ఇన్ పూర్తిచేసిన తర్వాతే ఫ్లైట్ రద్దు సమాచారం అందించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ నిర్వహణపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక విశాఖపట్నం నుంచి కూడా 8 ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయి. ఇవి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ రూట్లకు చెందినవే.
ఇండిగో ఫ్లైట్ రద్దుల వెనుక కారణాలు ఏమిటన్న దానిపై ప్రయాణికులు స్పష్టత కోరుతున్నారు.