Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 7 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ నుంచి పాట్నాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యమైంది. అయితే.. ఇప్పటికీ విమానం బయల్దేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. ఇండిగో సిబ్బందిని చుట్టుముట్టి నిలదీశారు. ఎయిర్ లైన్స్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చామని, విమానం ఆలస్యం ఉంటే.. తమకెందుకు ఇన్ఫామ్ చేయలేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.