హైదరాబాద్‌లో మొబైల్‌ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం

Update: 2020-04-23 08:26 GMT

కరోనా నేపథ్యంలో దేశంలోనే తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో గురువారం ప్రారంభించారు. దీన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల బృందం అందించిన ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో ఐకామ్‌, ఐక్లీన్‌ సంస్థ సహకారంతో దీన్ని రూపొందించారు.

కరోనా పరీక్షలతోపాటు, వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీపై ఈ ల్యాబ్‌ పనిచేయనుంది. ఈ ల్యాబ్‌లో ప్రతిరోజు సుమారు వెయ్యి నిర్థారణ పరీక్షలు చేయవచ్చు. ఈ కార్యక్రమంలో ‌కేంద్రమంత్రులు సంతోష్‌ గాంగ్వార్‌, కిషన్‌ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గబ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News