శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద

మహారాష్ర్ట, తెలంగాణలోనూ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరతెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు క్రమంగా పెరుగుతోంది.

Update: 2019-09-03 00:56 GMT

మహారాష్ర్ట, తెలంగాణలోనూ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరతెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులోనికి 38,355 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1066.40 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రాజెక్టులో ప్రస్తుతం 22.586 టీఎంసీలు నీరుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు. ఇలానే వరస క్రమంగా తరలివస్తే నీటి మట్టం పెరిగేఅవకాశం ఉందంటున్నారు అధికారులు.  

Tags:    

Similar News