దిల్ రాజు నివాసంలో రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు

దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో రెండో రోజూ కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జనవరి 21 తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2025-01-22 06:52 GMT

దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో రెండో రోజూ కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జనవరి 21 తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. జనవరి 22 న కూడా సోదాలు సాగుతున్నాయి. మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు కుమార్తె హన్సితా రెడ్డి నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. జనవరి 21న హన్సితా రెడ్డి అందుబాటులో లేరు. దీంతో ఆమెను హైదరాబాద్ కు రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఆమె బుధవారం ఉదయం హైదరాబాద్ కు వచ్చారు. హన్సితా రెడ్డి, దిల్ రాజు సోదరుడు నర్సింహారెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఇళ్లు, కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు.

జనవరి 21న 55 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా బుధవారం కూడా సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు భార్యను ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లను ఓపెన్ చేయించారు. ఐటీ అధికారులు అడిగిన సమాచారాన్ని అందించినట్టుగా దిల్ రాజు భార్య మంగళవారం మీడియాకు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పుష్ప 2 సినిమాను నిర్మించారు. ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని ఆ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ ప్రకటించిన ఆదాయంతో పాటు ప్రభుత్వానికి చెల్లించిన పన్నుకు సంబంధించిన విషయాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News