భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం
Bhadradri Kothagudem: అశ్వరావుపేట మండలంలో అమ్మవారి ఆలయం వద్ద ..క్షుద్రపూజలు చేస్తూన్నారంటూ భార్యభర్తలను అడ్డుకున్న గ్రామస్తులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం
Bhadradri Kothagudem: భద్రాదికొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అశ్వరావుపేట మండలం వేదాంతపురం అటవీప్రాంతంలో అమ్మవారి ఆలయం వద్ద క్షుద్రపూజలు చేస్తూన్నారంటూ భార్యభర్తలను గ్రామస్తులు అడ్డుకున్నారు. సాయంత్రం పూట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి క్షుద్రపూజలు చేస్తున్నాడు అంటూ గ్రామస్ధులు నిర్భందించారు. దేవాలయంలో దర‌్శనానికి వస్తే కావాలని నిందలు వేస్తూ క్షుద్ర పూజలు అని ఆరోపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. విషయం పోలీసులు దాకా చేరడంతో పోలీస్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.