Cold Wave: తెలంగాణలో చలిపులి పంజా.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Cold Wave: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
Cold Wave: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం కారణంగా రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.
వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం:
రాష్ట్రంలో సాధారణం కన్నా కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ మేర పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేశారు.
నేడు (శుక్రవారం), రేపు (శనివారం) రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో శీతల మరియు అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక (Yellow Alert) జారీ చేశారు.
ఎల్లుండి (ఆదివారం) నుంచి రాష్ట్రంలో పొగ మంచు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శీతల గాలులు, పొగ మంచు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.