Kishan Reddy: ఫిరాయింపులపై కేసులు పెట్టాల్సి వస్తే ముందు కేసీఆర్‌పై పెట్టాలి...

Kishan Reddy: కేసీఆర్‌ కూతురిని బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచన మాకు లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2022-11-18 15:00 GMT

Kishan Reddy: ఫిరాయింపులపై కేసులు పెట్టాల్సి వస్తే ముందు కేసీఆర్‌పై పెట్టాలి...

Kishan Reddy: కేసీఆర్‌ కూతురిని బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచన మాకు లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్వింద్ ఇంటిని పరిశీలించిన తర్వాత టీఆర్ఎస్‌పై కిషన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అర్వింద్‌ నివాసంపై అధికార పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య. ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్న వ్యక్తి కేసీఆరే అని అన్నారు. భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి తమది కాదని కిషన్‌రెడ్డి అన్నారు. రాజీనామాలు కూడా చేయించకుండా కేసీఆర్‌ పార్టీలో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయింపులపై కేసు పెట్టాలంటే కేసీఆర్‌ మీదే పెట్టాలని కిషన్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరాశతోనే దాడులకు దిగుతున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News