భయం భయంగా రెవెన్యూ సిబ్బంది.. కిటికీలో నుంచే దరఖాస్తులు

Update: 2019-11-15 09:51 GMT

తహశీల్దార్ విజయారెడ్డి హత్యానంతరం తెలంగాణలో రెవెన్యూ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దారు కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే వారిని తనిఖీలు చేస్తూ లోనికి అనుమతిస్తున్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను కిటికిలో నుంచే తీసుకుంటున్నారు.

తమ కార్యాలయానికి వచ్చిన వారిని ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో బాధితులను లోపలికి పిలిస్తే గేటు వద్ద వారిని వీఆర్‌ఏలు తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగా పనిచేస్తే దాడి ఘటనలు ఎందుకు జరుగుతాయని మండిపడుతున్నారు. 

Tags:    

Similar News