Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట

Smita Sabharwal: తెలంగాణలో కాళేశ్వరం కేసుకి సంబంధించి ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

Update: 2025-09-25 06:59 GMT

Smita Sabharwal: తెలంగాణలో కాళేశ్వరం కేసుకి సంబంధించి ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, అలాగే కమిషన్ నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ స్మితా సభర్వాల్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదికను కొట్టివేయాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు.

స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags:    

Similar News