Bathukamma: సరూర్‌నగర్ మైదానంలో బతుకమ్మ సంబురాలు.. రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం
Bathukamma: హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది.
Bathukamma: హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ ఏర్పాటు చేశారు.
ఒకేసారి 10వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడారు. మంత్రి సీతక్క బతుకమ్మపాట పాడి అలరించారు.