Hyderabad Water Cut Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్.. మీ ఏరియా ఉందో లేదో చూసుకోండి!
Hyderabad Water Cut Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్! కృష్ణా ఫేజ్-2 పైపులైన్ మరమ్మత్తుల కారణంగా జనవరి 10 ఉదయం నుంచి 36 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. జలమండలి ప్రకటించిన ప్రభావిత ప్రాంతాల జాబితా మరియు సమయాల వివరాలు.
Hyderabad Water Cut Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్.. మీ ఏరియా ఉందో లేదో చూసుకోండి!
Hyderabad Water Cut Alert: భాగ్యనగర వాసులకు జలమండలి (HMWS&SB) ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నగరానికి తాగునీరు అందించే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 పైపులైన్లకు అత్యవసర మరమ్మత్తులు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పనుల కారణంగా నగరంలోని పలు డివిజన్లలో 36 గంటల పాటు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
ప్రారంభం: జనవరి 10వ తేదీ, శనివారం ఉదయం 6:00 గంటలకు.
ముగింపు: జనవరి 11వ తేదీ, ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు: జలమండలి ప్రకటించిన జాబితా ప్రకారం ఈ క్రింది ప్రాంతాల్లో అంతరాయం కలగనుంది:
వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలీనగర్, నాగోల్.
బడంగ్‌పేట్, లెనిన్ నగర్, ఆదిభట్ల, కమ్మగూడ.
బాలాపూర్, బర్కాస్, మైసారం, యెల్లుగుట్ట, నాచారం.
తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మర్రెడ్‌పల్లి.
ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి, మహేంద్ర హిల్స్.
హష్మత్‌పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, సికింద్రాబాద్ కాంటోన్మెంట్.
శాస్త్రిపురం, మధుబన్, ప్రశాసన్‌నగర్ (పాక్షికంగా), నేషనల్ పోలీస్ అకాడమీ.
మరమ్మత్తు పనుల వివరాలు: కోదండాపూర్ నుంచి గొడకండ్ల మధ్య ఉన్న ప్రధాన పైపులైన్‌పై ఏర్పడిన లీకేజీలను సరిచేయడంతో పాటు, నాసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు, దెబ్బతిన్న బటర్ ఫ్లై వాల్వ్‌ల మార్పిడి పనులను జలమండలి చేపట్టనుంది.
జలమండలి సూచన: నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని ప్రజలు ముందు జాగ్రత్తగా తమ అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు కోరారు. నీటి వినియోగంలో పొదుపు పాటించాలని సూచించారు.