Hyderabad: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసు – ఎఫ్‌ఐఆర్‌లో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు

హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పలు కీలక విషయాలను బయటపెట్టారు. రాజస్థాన్‌కు చెందిన దంపతులు గోవింద్ సింగ్, సోనియాలు గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను ఐవీఎఫ్‌ కోసం సంప్రదించారు.

Update: 2025-07-27 09:58 GMT

Hyderabad: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసు – ఎఫ్‌ఐఆర్‌లో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు

హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పలు కీలక విషయాలను బయటపెట్టారు. రాజస్థాన్‌కు చెందిన దంపతులు గోవింద్ సింగ్, సోనియాలు గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను ఐవీఎఫ్‌ కోసం సంప్రదించారు. ఆమె సరోగసీ చేయాలని సూచించి, వారి స్పెర్మ్‌, అండంతోనే బిడ్డ పుడుతుందని హామీ ఇచ్చిందట. మొత్తం ఖర్చు ₹30 లక్షలు అవుతుందని చెప్పి, ₹15 లక్షలు నగదు, మరో ₹15 లక్షలు చెక్కు రూపంలో ఇవ్వాలని ఒప్పందం కుదిరింది.

గతేడాది ఆగస్టులో ₹5 లక్షలు నమ్రత ఖాతాకు బదిలీ చేశారు. సెప్టెంబర్‌లో దంపతులను విశాఖపట్నంకు పిలిచి స్పెర్మ్‌, అండం సేకరించారు. విడతల వారీగా డబ్బులు చెల్లిస్తూ, ఈ ఏడాది మే నాటికి మొత్తం మొత్తం చెల్లించారు. సరోగసీ విజయవంతంగా మొదలైందని నమ్రత వారికి చెప్పింది. అయితే, ఒప్పందం ప్రకారం డీఎన్‌ఏ టెస్ట్ చేయమని కోరగా, ఆమె నిరాకరించింది.

తరువాత సరోగేట్ మహిళ భర్త ₹3.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పి, దంపతుల నుంచి ₹2.5 లక్షలు తీసుకున్నారు. అనంతరం డాక్టర్ కల్యాణి బిడ్డను చూపించింది. కానీ ఢిల్లీలో డీఎన్‌ఏ పరీక్ష చేయగా, ఆ శిశువు వారిది కాదని తేలింది. అసలు తల్లిదండ్రులకు బిడ్డను అప్పగించమని కోరగా, నమ్రత వారిని బ్లాక్ చేసిందని వారు ఆరోపించారు.

దీంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డాక్టర్ నమ్రత, సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పిల్లల అక్రమ రవాణా కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. నమ్రతను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడతాయని, రిమాండ్ అనంతరం ఆమెను కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News