Rains: హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Rains: హైదరాబాద్‌లో రాత్రి నుంచి దంచికొడుతున్న వానలకు నగరం తడిసిముద్దైంది.
Rains: హైదరాబాద్‌లో రాత్రి నుంచి దంచికొడుతున్న వానలకు నగరం తడిసిముద్దైంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరమంతా నాన్‌స్టాప్‌గా కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. దాదాపు 7 గంటలకు పైగా ముసురుపట్టినట్టు కురుస్తున్న వానకు వాహనదారులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఒక్కసారిగా పెరిగిన వానలతో ఆఫీసులకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మియాపూర్‌లో దంచికొట్టిన వానకు రహదారులు కాలువలుగా మారాయి. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్‌లో కురిసిన జడివానకు రోడ్లపైకి వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠిలో పలు దుకాణాలను వరదనీరు ముంచెత్తింది.