Hyderabad: ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా హైదరాబాద్ రోడ్లు

* రోడ్డు ప్రమాదాల్లో ఏటా ప్రాణాలు కోల్పోతున్న వందలాది మంది * వికలాంగులుగా మారి జీవితాలను కోల్పోతున్న యువత

Update: 2021-09-11 05:58 GMT

హైదరాబాద్ రోడ్ ప్రమాదాలు (ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో రోడ్‌ యాక్సిడెంట్లు సర్వ సాధారణంగా మారాయి. ప్రతియేటా రోడ్డు ప్రమాదాల బారిన పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు గాయాలపాలై.. వికలాంగులుగా మారుతున్నారు. దీనికి అతివేగం ఓ కారణమైతే అద్వాన్నంగా తయారైన రోడ్లు.. రోడ్లపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి మరో కారణం. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లపై ఇసుక పేరుకుపోయి వాహనాలు అదుపుతప్పుతున్నాయి. సాయిధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌కు గురికావడానికి కూడా అతివేగంతో పాటు రోడ్డుపై ఇసుక కూడా కారణమని తెలుస్తోంది.

Tags:    

Similar News