Hyderabad Rains: ప్రాణం తీసిన వరద నీరు!
Hyderabad Rains: నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బల్కంపేట అండర్ బ్రిడ్జ్ కింద ఓ వ్యక్తి మృతి చెందారు.
Hyderabad Rains: నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బల్కంపేట అండర్ బ్రిడ్జ్ కింద ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు ముషీరాబాద్‌కు చెందిన షరీఫుద్దీన్‌గా గుర్తించారు. షరీఫుద్దీన్ విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో బల్కంపేట్ చేరుకున్నాడు. బల్కంపేట్ అండర్‌పాస్ బ్రిడ్జి వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలోకి బైక్‌పై వచ్చాడు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు షరీఫుద్దీన్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతడు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబసభ్యులకు విషయం చెప్పారు.