హైదరాబాద్ సిటీని అలుముకున్న క్యుమిలో నింబస్ మేఘాలు
Hyderabad Rains: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
Hyderabad Rains: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ఒక్క సారిగా మబ్బులు చుట్టుముట్టి ఆకస్మికంగా కుండపోత వాన కురుస్తుంది. జనజీవనాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తన్నాయి. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అవుతున్నాయి. పలు ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్ పల్లి, బేగంపేట, మలక్ పేట ప్రాంతాలలో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. ఖైరతాబాద్ -రాజ్ భవన్ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి ప్యాట్నీ నాలా వరద ప్రవాహంతో ఉప్పొంగి ఇళ్లల్లోకి వరద చేరింది...నాలా రిటర్ణింగ్ వాల్ పనులకు వర్షం అడ్డంకిగా మారింది. నాలాలోకి పైనుండి వచ్చే వరద నీటితో ప్యాట్నీ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలో కురుస్తున్న వర్శషాలతో పలు కాలనీలో ముంపులోనే ఉంటున్నాయి. కొన్ని అపార్ట్ మెంట్ల సెల్లార్లు మునిగిపోయాయిత చాలా చోట్ల ఇళ్ల ముందు నిలిపు ఉంచిన వాహనాలు సైతం కొట్టుకు పోతున్నాయి. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్ ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.కె.బి.ఆర్ పార్క్ వద్ద మేజర్ వాటర్ లాగిన్ పాయింట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ సిటీనిలో క్యుమిలో నింబస్ మేఘాలు అలుముకున్నాయి. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావఱణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతంప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల , రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తారు వర్శం పడుతుందని అధికారులు ప్రకటించారు. ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.