Hyderabad Office Places: హైద్రాబాద్‌లో ఇళ్ల గిరాకీ తగ్గింది.. కానీ ఆఫీసుల కోసం స్థలాల రేట్లు మాత్రం పెరిగాయ్

Hyderabad Office Places: ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల గిరాకీ బాగా తగ్గిపోయిందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.

Update: 2025-07-04 12:18 GMT

Hyderabad Office Places: హైద్రాబాద్‌లో ఇళ్ల గిరాకీ తగ్గింది.. కానీ ఆఫీసుల కోసం స్థలాల రేట్లు మాత్రం పెరిగాయ్

Hyderabad Office Places: ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల గిరాకీ బాగా తగ్గిపోయిందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే ఆఫీసుల కోసం స్థలాల రేట్లు మాత్రం జోరందుకున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం ఇళ్ల విక్రయాలు 2శాతం తగ్గితే.. ఆఫీసుల స్థలాల జోరు మాత్రం ఏకంగా 41 శాతం పెరిగిందని కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ నివేదికలో ఇంకా ఏముందంటే..

హైదరాబాద్‌లో కార్యాలయాల స్థలాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. 2024 ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే 2025 ఏప్రిల్ – జూన్‌లో ఆఫీసుల కోసం స్థలాల లీజులు ఏకంగా 11 శాతం పెరిగాయని కొలియర్స్ నివేదక చెబుతుంది. మరోపక్క నైట్ ఫ్రాంక్ నివేదిక హైదరాబాద్‌ లో ఆఫీసుల కోసం స్థలాల లీజు 41 శాతం పెరిగిందని చెబుతోంది.

ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఇళ్ల అమ్మకాలు 1,70,201 కి పరిమితమయ్యాయి. ఇదే సమయంలో ఇళ్ల ధరలు సగటున 2–14 శాతం పెరగాయని నైట్ ఫ్రాంక్ నివేదిక చెబుతోంది. మొత్తం అమ్మకాల్లో కోటి రూపాయల లోపులోనివి 51 శాతం ఉండగా.. అంతకుమించి ఖరీదైనవి 49 శాతం ఉంది. ఇక ఆఫీసుల స్థలాల లీజు విషయానికొస్తే.. 48.9 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.

ఈ సంవత్సరం(2025) మొత్తం మీద ఇది 80–90 మిలియన్ చ.అ.కు చేరొచ్చు అని నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. మొత్తంమీద గతేడాది అంటే 2024లో 71.9 మిలియన్ చ.అ లీజు నమోదైందని తెలుస్తోంది. అదేవిధంగా మొదటి ఆరునెలల్లో 49 శాతం గృహాలు కోటి, ఆపైన, 51 శాతం కోటి లోపు ధరలు కలిగి ఉన్నాయి.

ఆఫీసు స్థలాల గిరాకీ దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో చూస్తే మొదటి స్థానంలో బెంగుళూరు నిలిచింది. ఇక్కడ ఈ ఏడాది.. 18.2 మి. అ స్థలం లీజుకు వెళ్లిందని తాజా నివేదిక చెబుతోంది. అదేవిధంగా ఆ తర్వాత స్థానం ఢిల్లీ తీసుకుంటే మూడో స్థానంలో హైదరాబాద్ నిలిచింది.

ఆఫీసుల స్థలాల గిరాకీ పెరగడానికి కారణం:

పెరుగుతున్న గిరాకీ

హైదారాబాద్‌లో ఐటీ, టెక్నాలజీ కెంపీలు అంతకంతకూ పెరుగుతూ వెళుతున్నాయి. దీనికోసం అదనంగా ఆఫీసు స్థలాలు అవసరం పడుతుంది. దీంతో వీటి గిరాకీ పెరుగుతోంది.

నగర అభివృద్ధి

హైదరాబాద్ నగరంలో ఎక్కడకక్కడ మెట్రో స్టేషన్లు, ఫ్లైవోవర్లు అదేవిధంగా ఓఆర్ఆర్ వంటివి రావడం వల్ల వీటికి దగ్గరలో ఆఫీసులు, వ్యాపారాలు ఏర్పాటు నిమిత్తం స్థలాల గిరాకీ పెరిగిపోయింది.

ప్రభుత్వ మద్దతు

ప్రభుత్వ విధానాలు కూడా కార్యాలయ స్థలాల మార్కెట్ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

Tags:    

Similar News